- Step 1
బఠాణీలను పలుకుగా రుబ్బి ఉంచుకోవాలి. నెయ్యిని వేడి చేసి దానిలో సోంపు, ఉల్లివిత్తనాలు,నూరి ఉంచుకున్న బఠాణీలను వేయాలి.
- Step 2
దానికి మిగిలిన మసాలాలను కూడా వేసి సన్నని సెగ మీద ఐదారు నిముషాలు ఉడికించాలి తరువాత దించి పక్కకు పెట్టుకోవాలి.
- Step 3
మైదాలో ఉప్పు ,నెయ్యి వేసి నీటితో తడిపి ముద్దగా కలిపి ఉంచుకోవాలి.
- Step 4
ఈ మైదా ముద్దని 15 నుంచి 16 భాగాలుగా చేసి ఉండలు చేసి ఉంచుకోవాలి. ఒక్కొక్క ముద్దని అరచేతిలో తీసుకుని పల్చగా వత్తుకోవాలి.
- Step 5
తరువాత కొంచెం బాఠాణీల మిశ్రమాన్ని తీసుకుని పూరీ మధ్యలో పెట్టి దానిని మళ్లీ గుండ్రంగా చుట్టుకోవాలి.
- Step 6
ఇలా చేసి పెట్టుకున్న వాటిని పూరీలా పల్చగా వత్తుకోవాలి.
- Step 7
మూకుడులో నూనె వేసి బాగా కాగిన తరువాత ఒక్కొక్కటిగా పూరీలను వేయించుకోవాలి.
- Step 8
రెండు వైపులా ఎర్రగా కాల్చిన తరువాత ఈ పూరీలను వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయి.