- Step 1
బాణలిలో రెండు చెంచాల నూనె వేడిచేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, పనీర్ తురుము, క్యాప్సికం ముక్కలు వేయించాలి.
- Step 2
రెండు నిమిషాలయ్యాక టమాట ముక్కలు, అల్లం, వెల్లుల్లి మిశ్రమం పసుపు సరిపడా ఉప్పు, కారం, కరివేపాకు చేర్చి వేయించి ముక్కల్ని మగ్గనివ్వాలి.
- Step 3
చివరగా కొత్తిమీర వేసి దింపేస్తే సరిపోతుంది. ఈ కూరను చపాతీల్లో ఉంచి గుండ్రంగా చుట్టేయాలి.
- Step 4
ఇలా చేసుకున్న వాటిని పెనంపై ఉంచి మరో చెంచా చొప్పున నూనెవేసి రెండువైపులా కాల్చు కోవాలి.
- Step 5
ఇంకా రుచికరంగా ఉండాలనుకుంటే మైదా, మొక్క జొన్న పిండిలో ముంచి కాగుతోన్న నూనెలో వేయించుకోవచ్చు.