పచ్చిబఠానీ, బంగాళదుంపల మిశ్రమంతో తయారయ్యే ఈ వంటకం ఎంతో రుచిగా వుంటుంది. ప్రతిరోజూ ఒకేరకమైన వంటకాలు తినితిని బోర్ కొడితే.. ఏదైనా ప్రత్యేకంగా తినాలని అనిపిస్తుంది. అలాంటప్పుడు ఈ ఆలు పుజియా వంటకాన్ని చేసుకుని తింటే చాలా వెరైటీగా అనిపిస్తుంది. లంచ్, డిన్నర్’లో భోజనంతోపాటు దీనిని తీసుకుంటే అద్భుతంగా వుంటుంది.
ఈ వంటకాన్ని తయారుచేయడం చాలా సులభం. పైగా ఎక్కువ పదార్థాలు కలపాల్సిన అవసరమూ లేదు. ఎక్కువ కష్టపడకుండా అనతికాలంలోనే సింపుల్’గా ముగించేయొచ్చు. ఇంటికి అతిథులు వచ్చినప్పుడు కూడా వారికి ప్రత్యేకంగా పెట్టాలనుకున్నప్పుడు.. అప్పటికప్పుడే ఈ టేస్టీ పుజియాను తయారుచేసుకొని వారికి వడ్డించొచ్చు. మరి ఈ వంటకాన్ని ఎలా తయారుచేస్తారో తెలుసుకుందాం...