- Step 1
మొదట కోడిగుడ్లను ఉడకబెట్టి, పొక్కులు తీసి పెట్టుకోవాలి.
- Step 2
ఎండు కొబ్బరిని తురుమి పెట్టుకోవాలి. వేరుసెనగ పప్పును బాణలిలో వేసి (నూనె లేకుండా) వేయించాలి.
- Step 3
తర్వాత పొట్టు తీసి ఎండు మిరపకాయలతో కలిపి రుబ్బుకోవాలి ఎండు కొబ్బరి తురుమును, మూడు చిటికెల ఉప్పును వేసి మరో సారి రుబ్బుకోవాలి.
- Step 4
ఆ తర్వాత ఉడికించిన గుడ్డును మధ్య భాగంలో కత్తితో కోసి, అందులో వేరుసెనగపప్పు, ఎండుకొబ్బరి మిశ్రమాన్ని పెట్టాలి ఒక పాత్రలో సెనగపిండి, తగినంత ఉప్పు, ఒక టీస్పూన్ కారం పొడి కలిపి, కావలసినన్ని నీళ్ళు పోసి కాస్త గట్టిగా కలుపుకోవాలి.
- Step 5
స్టవ్ పై బాణలి పెట్టి, అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేయాలి నూనె బాగా కాగిన తర్వాత వేరుసెనగపప్పు, ఎండు కొబ్బరి మిశ్రమం పెట్టిన గుడ్లను సెనగపిండిలో ముంచి తీసి కాగుతున్న నూనెలో వేసి వేయించాలి.
- Step 6
అంతే నోరూరించే ఎగ్ బోండాలు రెడీ.