- Step 1
మటన్ ముక్కలు కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక బట్ట మీద వేసి కాసేపు ఆరనివ్వాలి.
- Step 2
మూకుడులో నూనె(డీప్ ఫ్రైకి సరిపడా) వేడి చేసుకొని మటన్ ముక్కలు వేయించుకోవాలి.
- Step 3
మటన్ ముక్క ఉడకడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ముక్క ఉడికింది లేనిది చూసుకొని, నూనెలో నుంచి చిల్లుల గరిటెతో ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
- Step 4
స్టవ్ ఆర్పివేయాలి. మూకుడులో ఒక కప్పు లేదా కప్పున్నర నూనె మాత్రం ఉంచి మిగిలిన నూనె తీసేయాలి.
- Step 5
స్టవ్ తక్కువ మంట మీద పెట్టుకొని ఆ మూకుడు పెట్టి, అందులో నూరిన అల్లం, వెల్లుల్లి ముద్ద,లవంగాల పొడి, కారం, ఉప్పు వేసుకోవాలి.
- Step 6
స్టవ్ ఆర్పివేసి గిన్నెలోకి తీసుకున్న మటన్ ముక్కలను వేసి అన్ని ముక్కలకు కారం పట్టేలా కలపాలి. వేడి తగ్గిన తరువాత నిమ్మకాయరసం పిండాలి.