- Step 1
ఒక ఓవెన్’ను తీసుకుని దానిని 170 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద ఫ్రీహీట్ చేసి వుంచాలి.
- Step 2
8 అంగుళాల పొడవు వున్న ఒక పాత్రను తీసుకుని, దానికి నూనె రాయాలి.
- Step 3
ఒక బౌల్ తీసుకుని అందులో మైదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడాతోబాటు తగినంత ఉప్పు వేసి బాగా కలియబెట్టాలి.
- Step 4
మరొక బౌల్ తీసుకుని అందులో ఉప్పులేని బటర్, పంచదార వేసి కలగలుపుకోవాలి. అలాగే గుడ్డుకూడా పగులకొట్టి వేసి, మిక్స్ చేయాలి. అనంతరం ఆరెంజ్ జ్యూస్, ఆరెంజ్ జస్ట్ కూడా వేసి కలపాలి.
- Step 5
ఈ విధంగా కలుపుకున్న అనంతరం ఇందులో ఇదివరకే మిక్స్ చేసుకున్న మైదా మిశ్రమాన్ని పోసి, బాగా కలియబెట్టాలి.
- Step 6
ఇలా కలియబెట్టిన ఈ మిశ్రమాన్ని ఇదివరకు నూనె పట్టించిన కేక్ పాన్’లో వేసి, 170 డిగ్రీల ఉష్ణోగ్రతలో వున్న ఓవెన్’లో పెట్టాలి. టూత్ పిక్ బయటకు వచ్చేవరకూ బేక్ చేయాలి. ఇలా వేడి చేసిన తర్వాత ఆ పాన్’ను ఓవెన్ నుంచి బయటకు తీసి, 10 నిముషాలవరకు చల్లార్చాలి.
- Step 7
ఇప్పుడు మరొక పాన్ తీసుకుని అందులో చాక్లెట్, బటర్ రెండూ వేసి, మీడియం మంటమీద కరిగించాలి. అనంతరం స్టౌవ్ మీదనుంచి పాన్’ను కిందకు దించి, గది ఉష్ణోగ్రత వద్ద చల్లార్చాలి. చల్లారిన తర్వాత అందులో వెనీలా ఎక్సాక్ట్ వేసి మిక్స్ చేయాలి. తర్వాత పంచదార పౌడర్, క్రీమ్ కూడా వేసి కలియబెట్టాలి.
- Step 8
మరోవైపు కేక్ చుట్టూ వున్న స్టిప్ పీక్’కు తుడిచి పక్కకు తీసేయాలి. అప్పుడు కేక్’ను కరిగించి, చల్లార్చి పెట్టుకున్న చాక్లెట్ మిశ్రమాన్ని జోడించాలి. అంతే.. ఆరెంజ్ కేక్ విత్ చాకొలెట్ రెడీ!