మామిడికాయను పండ్ల రారాజుగా పేర్కొంటారని అందరికీ తెలిసిందే! ఎందుకంటే.. మామిడితో వివిధరకాల ఫ్రూట్స్, వంటకాలు, పిక్కిల్స్, ఇంకా ఎన్నోరకాల రిసిపీలను తయారుచేయవచ్చు. అంతేకాదు.. మానవశరీరానికి అవసరయ్యే పోషకవిలువలు కూడా ఇందులో పుష్కలంగా వుంటాయి. అందుకే.. పండ్లలోనే దీనికి ప్రత్యేకస్థానం వుంది.
ఇక ఈ పండ్లరసాల విషయానికొస్తే.. వివిధ ప్రాంతాల్లో ఒక్కొక్కరకంగా తయారుచేస్తారు. అందులో భాగంగానే పంజాబ్’లో డ్రై ఫ్రూట్ మ్యాంగో లస్సీ ఎంతో అద్భుతంగా వుంటుంది. వారికి ఇది ట్రెడిషనల్ లస్సీ. అంటే.. ఏ కార్యాలొచ్చిన ఈ లస్సీ ఖచ్చితంగా వుండాల్సిందే! అంతేకాదు.. ప్రతిఒక్క రెస్టారెంట్లోనూ దీని డిమాండ్ బాగానే వుంటుంది.
ఇది పంజాబ్’లోనే కాదు.. విదేశాల్లో కూడా చాల ఫేమస్. దీనిని తాగిన వెంటనే మైండ్ రీఫ్రెషింగ్ అయి చాలా కూల్’గా వుంటారు. మనసు ప్రశాంతంగా వుంటుంది. కోల్పోయిన శక్తిని తిరిగి పొందగలరు. ఇంతటి పౌష్టికమైన ఈ లస్సీని ఎలా తయారుచేస్తారో తెలుసుకుందాం...