ఫ్రూట్ సలాడ్’లాగే ఇతర పండ్లను జోడించి మిక్స్డ్ ఫ్రూట్ తయారుచేసుకుని తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ప్రతిరోజూ రోజువారి ఆహారవంటకాలను తిని బోర్ కొట్టినప్పుడు రకరకాల ఫ్రూట్స్’ను జోడించి ఒక పానీయంలా చేసుకుంటే.. కడుపు నింపుగా వుండి, ఆకలిగా వుండదు. పైగా అది ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది కూడా!
సాధారణంగా పండ్లలో శరీరానికి కావలసిన పోషకవిలువలు చాలా వుంటాయని అందరికీ తెలిసిందే! అటువంటి పండ్లను ఒకేసారి ఏకంచేసి ఒక జ్యూస్ చేసుకుని తింటే.. ఎన్ని ఆరోగ్యప్రయోజనాలుంటాయో అర్థం చేసుకోవచ్చు. మరి.. ఆ కలర్’ఫుల్ ఫ్రూట్ మిక్స్డ్ ఎలా తయారుచేస్తారో తెలుసుకుందాం...