- Step 1
ముందుగా చికెన్ లెగ్ పీసులు శుభ్రంగా కడిగి వాటిని చాకుతో సన్నగా గీరాలి.
- Step 2
ఇలా అన్ని వైపులా గాటు పెట్టి ఉప్పు, నిమ్మరసం పట్టించి కొద్దిసేపు నానబెట్టాలి.
- Step 3
ఈలోగా పచ్చిమిర్చిని ముద్దగా నూరుకొని, సోయాసాస్, టొమాటో సాస్, మైదా, కార్న్‌ఫ్లోర్, అల్లంవెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, తెల్లమిరియాల పొడి, గుడ్డును కలిపి మిశ్రమంలా తయారు చేసుకోవాలి.
- Step 4
తరువాత ఈ మిశ్రమాన్ని చికెన్ ముక్కలకు బాగా పట్టించి మరో 15 నిమిషాల పాటు నానబెట్టాలి.
- Step 5
ఇప్పుడు స్టౌ మీద ఓ బాణలి పెట్టి అందులో వేయించడానికి సరిపడా నూనెపొయ్యాలి.
- Step 6
నూనె బాగా వేడెక్కిందని నిర్ధారించుకున్న తర్వాత ఒక్కో లెగ్‌పీస్ ను వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి.
- Step 7
వేడి చల్లారాక ముందే గీన్ చిల్లీ సాస్ తో వేడి వేడిగా లాగిస్తే ఆటేస్టే వేరు అనాల్సిందే మరి...