- Step 1
దోసకాయను చెక్కు తీసి ముక్కలుగా చేయాలి.
- Step 2
స్టవ్ వెలిగించి కళాయిలో నూనె వేడి చేసి ఎండిమిర్చి, మినపప్పు, సెనగపప్పు వేసి దోరగా వేపాలి.
- Step 3
ఇవి తీసి అదే నూనెలో దోసకాయ ముక్కలు వేసి మగ్గనివ్వాలి.
- Step 4
మిక్సి జార్లో వేపిన మిశ్రమాన్ని, ఉప్పు, వెల్లుల్లిని చింతపండు వేసి మెత్తగా మిక్సి చెయ్యాలి. దీనిలో మగ్గిన దోసముక్కలు వేసి ఒక సెకన్ తిప్పాలి (మిక్సి బటన్ అన్ చేసి ఆఫ్ చెయ్యటం).
- Step 5
దోసకాయ మెత్తగా అయితే బాగుండదు. కచ్చపచ్చగా ఉంటేనే బాగుంటుంది.
- Step 6
ఇప్పుడు స్టవ్ మీద కళాయిలో నూనె వేసి పోపుదినుసులు, కరివేపాకు, వెల్లుల్లి వేసి వేగాక, పచ్చడి పోపు వెయ్యాలి. అంతే దోసకాయ పచ్చడి రెడి.