మాన్’సూన్ వచ్చిందంటే చాలు.. ప్రతిఒక్కరు స్పైసీగా, వేడిగా వుండే ఆహారాలనే ఎక్కువగా ఇష్టపడతారు. ముఖ్యంగా చిరుతిండ్ల మీదే ఎక్కువ ఆసక్తి కనబరుస్తారు. కాఫీ, టీ, ఇతర హాట్ పానీయాలతోబాటు ఛాట్స్(స్నాక్స్)లో స్పెషల్’గా బజ్జీలు, పకోడాలు, సమోసాలు, ఇంకా ఇతర చిరుతిండ్లు సేవించడానికి ఇష్టపడతారు. అయితే వీటన్నింటికంటే సమోసా చాలా ప్రత్యేకంగా, స్పైసీగా, నోరూరించే విధంగా వుంటుంది. దీనిని సాధారణ రోజుల్లో కూడా తింటారు కానీ.. మాన్’సూన్’లో వేడివేడిగా తింటే దాని రుచే చాలా ప్రత్యేకంగా వుంటుంది.
ఇక సమోసాలను రకరకాల పద్ధుతుల్లోనూ తయారుచేసుకుంటారు. కొందరు మాంసాహారంతో తయారైన సమోసాలను ఇష్టపడితే.. మరికొందరు మాత్రం వెజిటెబుల్స్’లోని కొన్ని పదార్థాలతో తయారైన వాటిని మాత్రమే తినడానికి ఇష్టపడతారు. అందులో ముఖ్యంగా ఆలూ, ఉల్లిపాయ కాంబినేషన్’తో తయారయ్యే సమోసాతో ఎంతో రుచికరంగా వుంటుంది. పైగా బంగాళదుంప(ఆలూ)లో స్టార్చ్, కార్బోహైడ్రేట్’లు అధికంగా వుండటంతో అది అద్భుతమైన రుచిని కలిగి వుంటుంది. మరి దీన్ని ఎలా చేస్తారో తెలుసుకుందాం...