దాల్చిక చెక్క - అల్లంతో తయారుచేసుకునే టీ పానీయంతో శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముఖ్యంగా శరీర బరువును చాలావరకు తగ్గించుకోవచ్చు. అలాగే ఎఫెక్టివ్’గా అన్ని కార్యకలాపాల్లో పాల్గొనవచ్చు. ఎందుకంటే.. చెక్క, అల్లంలో మానవ శరీరానికి అవసరమయ్యే కొన్ని కీలక పోషకవిలువలు పుష్కలంగా వుంటాయి.
అవి శరీరంలోని కొవ్వు పదార్థాలను తగ్గించి, బరువును అదుపులో వుంచుతాయి. అంతేకాదు.. గుండె సంబంధిత వ్యాధుల నుంచి పోరాడీ, గుండెను సురక్షితంగా వుంచడంలో ప్రధానపాత్రను పోషిస్తాయి. మరి... ఇంతటి ఆరోగ్యకరమైన ఈ అల్లం-చెక్క టీని ఎలా తయారుచేస్తారో తెలుసుకుందామా...