- Step 1
ములగ ఆకు శుభ్రముగా కడిగి వడకట్టాలి ఫ్రెజర్ కుక్కర్ లో సగం నూనె వేడి చేసి అందులో తరిగిన క్యారెట్ ముక్కలు, బీన్స్, ఒక పచ్చిమిరపకాయలను వేయాలి.
- Step 2
పప్పు కడిగి రెండు కప్పుల నీళ్ళలో ముందే నానబెట్టి ఉంచుకోవాలి. పప్పు వడకట్టి కలపాలి. రెండు మూడు నిముషాలు వేయించాలి.
- Step 3
బంగాళదుంప తురుము, ములగ ఆకులు, అల్లం వేసి రెండు కప్పుల వేడి నీరు కలుపుకోవాలి అందులో ఉప్పు, పసుపు వేసి బాగా కలపాలి. మూత పెట్టి రెండు విజిల్స్ రానివ్వాలి.
- Step 4
కుక్కర్ స్టీం విడుదలయ్యాక రుచి కోసం నిమ్మకాయరసం కలపాలి.
- Step 5
మిగతా నూనె చిన్న ప్యాన్ లో వేడి చేసి తాలింపు గింజలన్నీ వేసి, చిటపటలాడక కరివేపాకు, ఇంగువ, మిగతా పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి.
- Step 6
ఈ తాలింపుని కుర్మాలో కలపాలి. కలియబెట్టాలి. ఇది అన్నానికి, చపాతిలకి మంచి కాంబినేషన్.