- Step 1
ముప్పావు కప్పు కొబ్బరి, బేబీ ఆనియన్స్, జీలకర్ర, కారం, పసుపు కలిపి గ్రైండ్ చేసుకోవాలి.
- Step 2
ఆ తర్వాత రెండు కప్పుల నీరు పోసి కుక్కర్ లో పప్పు ఉడికించుకోవాలి. తర్వాత కడిగిన ములగ ఆకులు, ఒక కప్పు వేడి నీరు పోయాలి.
- Step 3
ఉప్పు వేసి మూడు,నాలుగు నిముషాలు ఉడికించి పక్కన ఉంచుకోవాలి.
- Step 4
పాన్ లో నూనె వేడి చేసి మిగతా కొబ్బరి, మిరపకాయలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి.
- Step 5
ముందుగా రుబ్బుకున్న పేస్ట్ దీనిలో కలిపి, నూనె విడివడేదాక ఉంచుకోవాలి. ఈ మిశ్రమాన్ని పప్పులో కలుపుకోవాలి.
- Step 6
చిక్కబదేదాకా ఉడికించి, సర్వింగ్ డిష్ లోకి తీసుకోవాలి. పరోటాలు, అన్నం తదితరాలకు ఇది మంచి కాంబినేషన్.