- Step 1
ముందుగా మసాలా ముద్ద కోసం తీసుకున్నవన్నీ ముందు వేయించి చల్లారాక నీళ్ళు చల్లి ముద్ద చేయాలి.
- Step 2
కూరగాయలన్నీ శుభ్రంగా కడిగి ముక్కలుగా కోయాలి. వీటిలో తగినన్ని నీళ్ళు పోసి, ఉప్పు వేసి సగం ఉడికే వరకు ఉంచి దించాలి.
- Step 3
తర్వాత నీళ్ళు వంపేసి ఉంచాలి. ఉల్లిపాయలు సన్నగా తరగాలి.
- Step 4
టొమాటోలు గుజ్జుగా చేయాలి.
- Step 5
బాణలిలో నూనె వేసి కరివేపాకు, ఉల్లిముక్కలు వేసి బంగారు వర్ణంలోకి మారేవరకు వేయించాలి.
- Step 6
తరువాత మసాలా ముద్ద వేసి వేయించాలి.
- Step 7
ఇప్పుడు ఉడికించిన కూరగాయ ముక్కలు, టొమాటో గుజ్జు వేసి కలపాలి. తరువాత రెండు కప్పుల నీళ్ళు పోసి సిమ్ లో ఉడికించాలి.
- Step 8
తరువాత గరం మసాలా చల్లి దించాలి.