- Step 1
బంగాళాదుంపలు, బీన్స్, గుమ్మడి, క్యారెట్లను ముక్కలుగా కోయాలి క్యాలిఫ్లవర్ ను చిన్న రెమ్మలుగా తుంచాలి.
- Step 2
బాణలిలో కొద్దిగా నూనె వేసి ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి, మిగిలిన కొబ్బరి తురుము వేసి మంచి వాసనా వచ్చే వరకు వేయించి దించి మెత్తగా రుబ్బాలి.
- Step 3
మందపాటి బాణలిలో పలుచని కొబ్బరి పాలు పోసి అందులో కూరగాయ ముక్కలు వేసి ఉడికించాలి కొద్ది సేపటి తర్వాత పసుపు, ఉప్పు కూడా వేయాలి.
- Step 4
తరువాత చింతపండు గుజ్జు వేసి ముప్పావు వంతు ముక్కలు ఉడికే వరకు ఉంచాలి తర్వాత మసాలా పొడి వేసి మరో పది నిముషాలు ఉడికించాలి.
- Step 5
మరో పొయ్యి మీద చిన్న బాణలి పెట్టి కొద్దిగా నూనె వేసి ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు చేసి కూరలో వేయాలి చివరగా చిక్కని కొబ్బరి పాలు పోసి సిమ్ లో ముక్కలు పూర్తిగా ఉడికే వరకు ఉంచి దించాలి.