- Step 1
కాలీఫ్లవర్ పూరేమ్మల్ని విడదీయాలి. బంగాళాదుంపలు పెద్ద ముక్కలుగా కోయాలి.
- Step 2
మసాలా ముద్ద కోసం తీసుకున్నవన్ని మెత్తగా నూరాలి.
- Step 3
బాణలిలో 4 టేబుల్ స్పూన్ల నూనె వేసి పొడవుగా కోసిన ఉల్లిముక్కలు వేసి వేయించాలి.
- Step 4
తరువాత వీటిని ముద్దలా చేసి ఉంచాలి. ఇప్పుడు ఆ నూనెలోనే సన్నని ముక్కలుగా కోసిన ఉల్లిముక్కలు వేసి వేయించాలి.
- Step 5
తరువాత మసాలా ముద్ద వేసి మూడు నాలుగు నిముషాలు వేయించాలి.
- Step 6
కాలీఫ్లవర్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, బఠానీలు వేసి మూడు కప్పుల నీలు పోసి మూతపెట్టి ఉడికించాలి.
- Step 7
ముక్కలు ఉడికాక ఉల్లిముద్ద వేసి ఉప్పు వేసి ఉడికించాలి.
- Step 8
చివరగా పెరుగులో కుంకుమ పువ్వు వేసి కలిపి, మృదువుగా చేయాలి. ఇప్పుడు ఇది కూరలో వేసి ఓ నిమిషం ఉడికించి దించాలి.