- Step 1
ముందుగా కోడి మాంసాన్ని కడిగి ఒక పాత్రలో వేసుకోవాలి. తర్వాత మాంసానికి కారం పొడి, పసుపు తర్వాత అల్లం, వెల్లుల్లికి కొంచెం ఉప్పు చేర్చి పేస్ట్ లా చేసుకొని, మాంసానికి పట్టించాలి.
- Step 2
తర్వాత స్టవ్ మీద బాణలి పెట్టి అందులో మూడు స్పూన్ల నూనె పోసి, బాగా కాగాక మాంసం ముక్కలు అందులో వేసి, కొన్ని నీళ్ళు పోసి బాగా ఉడకనివ్వాలి.
- Step 3
మరో వైపు ధనియాలను మూకుడులో వేయించి (నూనె లేకుండా), కొబ్బరి, పట్టా, లవంగాలను మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి.
- Step 4
ఇప్పుడు మరో బాణలిలో కొంచెం నూనె వేసి పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి, అవి కొంచెం ఫ్రై అయ్యాక ఉడికించిన మాంసాన్ని కలపాలి.
- Step 5
మాంసం దించుకునే సమయంలో ధనియా, కొబ్బరి మిశ్రమాన్ని పైన చల్లుకోవాలి.
- Step 6
తర్వాత మాంసాన్ని బాగా కలబెట్టి దించుకోవాలి. ఇంతే ఘుమఘుమలాడే ధనియా చికెన్ ఫ్రై రెడీ.