- Step 1
ముందుగా మైదాపిండి, వంట సోడాలను కలిపి జల్లెడలో జల్లించి, అందులో గడ్డగా కాకుండా వేడిచేసి చల్లార్చిన నెయ్యి కలపాలి మొత్తం పిండిలో నెయ్యి అంతా కలిసేలా చూడాలి.
- Step 2
తర్వాత అందులో పెరుగు కూడా కలిపి, కొంచెం కొంచెం నీళ్లు చల్లుతూ గట్టి పిండి ముద్దలా చేసి 10 నిమిషాలు నాననివ్వాలి.
- Step 3
ఆ పిండిని గులాబ్‌జామ్‌లంత సైజులో ముద్దలుగా చేయాలి.
- Step 4
వాటిని రెండు అరచేతుల మధ్య గట్టిగా రుద్దుతూ, గుండ్రని ముద్దలుగా చేయడం వల్ల, గుల్లపడి బాదూషాలా తయారు చేయడానికి వీలవుతుంది.
- Step 5
ఇలా చేసిన పిండి ముద్దల మధ్యలో రెండు పక్కలా బొటనవేలు చివరతో నొక్కాలి.
- Step 6
ఇపుడు సన్నని మంట మీదున్న ఒక బాణలిలో నెయ్యి పోసి, దానిలో పిండిముద్దలను లేత బంగారురంగు వచ్చే వరకూ చేయించి, వాటిని ఒక ట్రేలో వరసగా అమర్చాలి.
- Step 7
ఆ తర్వాత ఒక గిన్నెలో చక్కెర వేసి, దానికి మూడు కప్పుల నీళ్లు కలిపి వేడిచేసి లేతపాకంలా తయారయ్యాక దానిని అమర్చి ఉంచుకున్న బాదుషాల మీద పోస్తే పాకం అంతా ఇంకిపోతుంది.