- Step 1
చికెన్ ముక్కల్ని శుభ్రం చేసి.. ఓ గిన్నెలోకి తీసుకోవాలి. అందులో పెరుగూ, కారం, పసుపూ, నిమ్మరసం, అల్లంవెల్లుల్లి ముద్దా, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి ఫ్రిజ్‌లో పెట్టేయాలి.
- Step 2
ఇంతలో బాణలిని పొయ్యిమీద పెట్టి.. రెండు చెంచాల నెయ్యి వేయాలి..
- Step 3
అది కరిగాక చింతపండూ, బెల్లం తరుగూ, ఉప్పూ తప్ప మసాలా కోసం పెట్టుకున్న పదార్థాలన్నింటినీ వేసి వేయించి తీసుకోవాలి.
- Step 4
వేడి చల్లారాక నీళ్లు చల్లుకుంటూ ముద్దలా చేసుకోవాలి.
- Step 5
బాణలిని మళ్లీ పొయ్యిమీద పెట్టి.. పెద్ద చెంచా నెయ్యి వేయాలి.
- Step 6
అది కరిగాక చికెన్ ముక్కలు వేసి మూత పెట్టాలి. చికెన్ ఉడికిందనుకున్నాక ఇవతలకు తీసేయాలి.
- Step 7
అదే బాణలిలో మిగిలిన నెయ్యి వేసి ముందుగా చేసుకున్న మసాలా వేయాలి.
- Step 8
దాని పచ్చివాసన పోయాక.. బెల్లం తరుగూ, కొద్దిగా చింతపండురసం, కొంచెం ఉప్పూ, చికెన్ ముక్కలూ వేసి.. బాగా కలపాలి. ఐదారు నిమిషాలయ్యాక దింపేస్తే చాలు.