- Step 1
ఆవనూనెని అడుగు మందంగా ఉన్న పాన్‌లో వేసి మంట పెంచి పొగ వచ్చే వరకు వేడిచేయాలి.
- Step 2
తరువాత స్టవ్ మీద నుంచి పాన్‌ని దింపి నూనె చల్లారనివ్వాలి.
- Step 3
తరువాత మళ్లీ ఒకసారి ఆవనూనెను ఓ మాదిరి మంట మీద వేడిచేసి లవంగాలు, యాలక్కాయలు, బిర్యానీ ఆకులు వేసి అవి చిటపటమనే వరకు వేయించాలి.
- Step 4
ఉల్లి తరుగు వేసి ఓ మాదిరి మంట మీద బంగారు రంగు వచ్చే వరకు వేగించాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరో నిమిషం వేయించాలి.
- Step 5
ఆ తరువాత మటన్ వేసి పావుగంట ఉడికించాలి.మంట తగ్గించి పెరుగు, కారం, కాశ్మీరి కారం, పసుపు వేసి కలిపి మరో ఐదు నిమిషాలు ఉంచాలి.
- Step 6
వెల్లుల్లి తరుగు, నీళ్లు, ఉప్పు, నెయ్యి వేసి మూతపెట్టి 50 నిమిషాలు ఉడికించాలి. సన్నటి మంట మీదే ఉడికించాలి.
- Step 7
ఒకవేళ రసం ఎక్కువ కావాలనుకుంటే నీళ్లు కలుపుకోవచ్చు.కొత్తిమీర తో అలంకరించి చపాతీలతో తింటే భలే బాగుంటుంది ఈ రాజస్తానీ మటన్ కర్రీ.