వింటర్’లో ప్రతిఒక్కరు వేడివేడిగా వుండే కొన్ని ప్రత్యేకమైన వంటకాల(స్నాక్)ను సేవించడానికి ఎంతో ఇష్టపడతారు. ముఖ్యంగా సాయంత్రవేళల్లో పకోడీలు, రకరకాల సూప్’లు, ఇంకా ఇతరత్ర వేడి పదార్థాలు తీసుకుంటారు. అయితే వీటిలో హాట్’హాట్’గా వుండే సూప్’లను వింటర్’లో తింటే మాత్రం ఎంతో ఆహ్లాదంగా వుంటుంది. చల్లచల్లని వాతావరణంలో వేడివేడి సూప్ తింటుంటే.. ఆ అనుభూతియే స్పెషల్’గా వుంటుంది.
సూప్’లలో చాలా రకాలున్నాయి. తమకు అనుగుణంగా ఎలా కావాలంటే అలా సూప్ రిసిపీలను చేసుకోవచ్చు. అయితే మిక్డ్స్ వెజిటబుల్ సూప్ తింటే ఆరోగ్యానికి ఎంతోమేలు. ఎందుకంటే.. ఫ్రూట్స్’లో ఎన్నో పోషకవిలువలు వుంటాయని విదితమే! అటువంటి వాటితో తయారయ్యే సూప్’ని సేవిస్తే.. ఒకేసారి ఎన్నో పోషకాలు శరీరానికి అందుతాయి. దాంతో శక్తిపెరగడంతోపాటు మెదడు చురుకుగా పనిచేస్తుంది. మరి.. ఈ సూప్’ను ఎలా చేస్తారో తెలుసుకుందామా...