- Step 1
ముందుగా స్టౌ మీద పాన్ పెట్టి తక్కువ మంట మీద అన్ని రకాల మసాలాలు వేసి రోస్ట్ చేసుకోవాలి.
- Step 2
అలాగే ఎండు మిర్చి కూడా రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి.వేయించుకున్న పదార్థాలు చల్లగా అయిన తర్వాత మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి.
- Step 3
ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కలు వేసి, అందులోనే గ్రైండ్ చేసుకున్న మసాలాలు, పెరుగు, వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి.
- Step 4
మ్యారినేషన్ సమయంలోనే పసుపు కూడా వేసి బాగా మిక్స్ చేసి ఒక గంట పక్కన పెట్టుకోవాలి. తర్వాత మరో పాన్ స్టౌమీద పెట్టి, నెయ్యి లేదా నూనె వేసి వేడి చేయాలి.
- Step 5
తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేగించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, బ్రౌన్ కలర్లోకి మారే వరకూ వేగించుకోవాలి.
- Step 6
ఇప్పుడు అందులో మ్యారినేట్ చేసిన చికెన్, వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేస్తూ వేగించుకోవాలి. తర్వాత అందులోనే 1/4కప్పు నీళ్ళు జోడించి, చిక్కగా ఉడికించాలి. మరీ గ్రేవీలా కాకుండా చిక్కగా ఉండేట్లు చూసుకోవాలి.
- Step 7
ఇప్పుడు, కొబ్బరి తురుము, చింతపండు పేస్ట్, బెల్లం, నెయ్యి కూడా వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి.
- Step 8
అవసరమైతే అందులోనే కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి ఉడికించుకోవచ్చు. మొత్తం మిశ్రమాన్ని 10 నిముషాలు మీడియం మంట మీద ఉడికించుకోవాలి.
- Step 9
అంతే చికెన్ చిల్లీ గీ రోస్ట్ రిసిపి రెడీ .వేడి వేడిగా వడ్డించడమే ఆలస్యం ఇష్టంగా తినేస్తారు.