- Step 1
బియ్యాన్ని కడిగి మెంతులతో కలిపి రెండు గంటలపాటు నీళ్లలో నానబెట్టుకోవాలి.
- Step 2
అరకప్పు చెరకు రసంలో మరమరాలను నానబెట్టుకోవాలి.
- Step 3
నానబెట్టిన బియ్యాన్ని మెత్తగా రుబ్బుకోవాలి.
- Step 4
అలాగే మరమరాలూ, మిగిలిన చెరకురసం, కొబ్బరితురుమూ, బెల్లం మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
- Step 5
ఇందులో ముందుగా రుబ్బుకున్న బియ్యప్పిండీ, తగినంత ఉప్పూ, యాలకులపొడీ వేసి కాసేపు నాననివ్వాలి. ఇది పులిస్తేనే బాగుంటుంది.
- Step 6
ఇప్పుడు గుంట పొంగనాల పెనాన్ని పొయ్యిమీద పెట్టి... నెయ్యి రాసి అందులో ఈ మిశ్రమాన్ని సగం వరకూ ఉంచాలి.
- Step 7
మూత పెట్టేస్తే కాసేపటికి ఇవి ఉడుకుతుంది. అప్పుడు తీసేయాలి.