- Step 1
ముందుగా గోధుమపిండిలో కొద్దిగా ఉప్పు వేసుకుని నీళ్లతో చపాతీపిండిలా కలిపి పెట్టుకోవాలి. ఇది నానేలోగా కూర సిద్ధంచేసుకోవాలి.
- Step 2
బాణలిలో చెంచా వెన్న కరిగించి ఉల్లిపాయముక్కలు వేయించుకోవాలి. అవి దోరగా వేగాక క్యారెట్ తురుమూ, కసూరీమేథీ, ఆలూ ముద్ద వేసి బాగా కలపాలి.
- Step 3
ఇది కూరలా తయారయ్యాక కారం, తగినంత ఉప్పూ, పచ్చిమిర్చి ముక్కలూ, గరంమాసాలా, జీలకర్రపొడీ కూడా వేసి కలిపి దింపేయాలి.
- Step 4
కొద్దిగా చపాతీ ముద్దను తీసుకుని చిన్న చపాతీలా చేసి అందులో ఒకటిన్నర చెంచా కూరను ఉంచాలి.
- Step 5
తరవాత అంచుల్ని మూసేసి నెమ్మదిగా పరోటాలా వత్తుకోవాలి. దీన్ని పెనంపై వేసి వెన్నతో రెండువైపులా కాల్చుకుంటే సరిపోతుంది.
- Step 6
ఇలా మిగిలిన పిండినీ చేసుకోవాలి.