- Step 1
బాదంపప్పులను కొద్దిసేపు వేడినీటిలో వేసి పైన తొక్క తీసి ముక్కలుగా చేసుకోవాలి.
- Step 2
మైదా, బేకింగ్ పౌడర్, వంటసోడా ఒక గిన్నెలో వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
- Step 3
వెన్నలో చక్కెర పొడి వేసి మృదువుగా అయ్యే వరకూ గిలక్కొట్టువాలి.
- Step 4
ఇందులోనే ఆల్మండ్ ఎసెన్స్ కూడా కలిపి వుంచుకోవాలి.
- Step 5
గట్టిపాలను నెమ్మదిగా పోస్తూ వెన్నలో కలిసేటట్టు స్పూనుతో కలుపు కోవాలి.
- Step 6
ఇప్పుడు ముక్కలుగా చేసి పెట్టుకున్న బాదం పప్పులను కూడా జతచేసుకోవాలి.
- Step 7
ఈ మిశ్రమంలో ముందుగా కలిపిపెట్టుకున్న మైదాపిండిని కలుపు కుంటూ అవసరం అనుకుంటే వేడిపాలు కొద్ది కొద్దిగా పోసుకోవాలి.
- Step 8
ఈ మిశ్రమాన్ని బేకింగ్ డిష్‌లోకి మార్చి ఓవెన్‌లో నలభై నిమిషాల పాటు బేకింగ్ చేసుకోవాలి. చల్లారిన తరువాత సర్వ్ చేసుకోవచ్చు.