- Step 1
బంగాళాదుంపల్ని సరిపడా నీళ్లూ, ఉప్పూ వేసి ఉడికించుకోవాలి. తరవాత చెక్కు తీసేసి మెత్తని గుజ్జులా చేసుకోవాలి.
- Step 2
ఇందులో కొత్తిమీర తరుగూ, వెల్లుల్లి ముక్కలూ వేసుకుని కలిపి ఈ మిశ్రమాన్ని సన్ననిమంటపై పెట్టాలి.
- Step 3
నిమిషం తరవాత క్రీం, వెన్నా, మిరియాలపొడీ, చీజ్ తురుమూ వేసుకుని బాగా కలపాలి.
- Step 4
వెన్న కరిగాక అవసరమనుకుంటే ఇంకొంచెం ఉప్పు వేసుకుని దింపేయాలి. ఇది చల్లగా అయ్యేలోగా తెల్లసొనను గిలకొట్టి అందులో మైదా వేసుకుని కలుపుకోవాలి.
- Step 5
పిండి గట్టిగా ఉంటే గనుక కొన్ని నీళ్లు పోసుకుని గరిటెజారుగా ఉండేలా చూడాలి.
- Step 6
ఇప్పుడు బంగాళాదుంప మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి.
- Step 7
ఒక ఉండను తీసుకుని ముందుగా మైదా మిశ్రమంలో ముంచి, తరవాత బ్రెడ్‌పొడి అద్ది కాగుతోన్న నూనెలో వేసేయాలి.
- Step 8
ఎర్రగా వేగాక తీస్తే సరిపోతుంది. పొటాటో పాప్స్ వేడివేడిగా తినడమే ఆలస్యం ఇక!