ప్రస్తుతరోజుల్లో ప్రతిఒక్కరు బ్రేక్’ఫాస్ట్’లో కేవలం బ్రెడ్’తో కూడిన పదార్థాలను తీసుకోవడం లేదా బయట ఏదిపడితే అది తింటుంటారు. అయితే అలా రెగ్యులర్’గా బయట ఆహారాలు తినడం వల్ల కచ్చితంగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అంతేకాదు.. ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటే.. జుట్టు, పొట్ట, చర్మం, ఇంకా ఇతరత్ర ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది.
కాబట్టి.. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడంలోనే ఎంతో శ్రేయస్కరం. ముఖ్యంగా బ్రేక్’ఫాస్ట్’లో ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకుంటే.. రోజంతా ఉత్తేజంగా, ఆహ్లాదంగా వుండొచ్చు. ఆ తరహా వంటకాల్లో సోయా పరోటా ఒకటి! ఇందులో ఎన్నోరకాల పోషకాలు వుంటాయి. కాబట్టి.. ఉదయాన్నే టిఫిన్’లో వీటిని తీసుకుంటే చాలా మంచిది. మరి దీనిని ఎలా చేస్తారో తెలుసుకుందామా...