- Step 1
ముందుగా జీడిపప్పు, ఎండుద్రాక్ష, పిస్తాలను కొంచెం నెయ్యిలో వేయించి పక్కన పెట్టుకోవాలి.
- Step 2
అలాగే కొంచెం పాలను ఒక పాత్రలో వేడి చేసి, వెచ్చబడిన తరువాత అందులో కుంకుమపువ్వు, జాపత్రి, జాజికాయపొడులను కలిపి నానబెట్టాలి.
- Step 3
తరువాత మిగిలిన పాలలో నాలుగు కపులను పక్కన పెట్టుకుని మిగిలిన పాలను బరువుగల పరిశుభ్రమైన ఇత్తడి పాత్రలో వేసి మీద మరిగించాలి.
- Step 4
ఈలోపుగాబియ్యంను శుభ్రం చేసి, నీళ్ళలో బాగా కడగాలి. పాలు బాగా మరగడం ప్రారంభించగానే
కడిగిన బియ్యంను పాలల్లో వేసుకోవాలి.
- Step 5
బియ్యం మెత్తగా ఉడికేంత వరకు స్టవ్ ను మీడియం సెగలో మండించాలి.
-
Step 6
మధ్యలో అప్పుడప్పుడూ గరిటెతో కలియబెడుతూ పాలను పోసి కలుపుతూ వుండాలి.
- Step 7
బియ్యం ఉడుకుతున్న సమయంలో పాలు ఇగిరిపోతుంటే వేరుగా వుంచుకున్న బియ్యం ఉడికిన తరువాత సెగ తగ్గించి కొద్ది కొద్దిగా పంచదార కలుపుతూ వుండాలి.
Step 8
-
పంచదార పూర్తిగా కరిగిన తరువాత, యాలకులపొడిని కలిపి, ఒకసారి మొత్తం మిశ్రమాన్ని గరిటెతో బాగా కలియబెట్టి, పాత్రను స్టే మీద నుంచి కిందకు దించుకోవాలి.
- Step 9
తరువాత అందులో నేతిలో వేయించి సిద్దంగా వుంచుకున్న జీడిపప్పు, ఎండుద్రాక్ష, పిస్తాలను పాలలో నానబెట్టిన కుంకుమపువ్వు, జాపత్రి, జాజికాయ పొడులను వేసి గరిటెతో కలపాలి.
- Step 10
చివరిగా మిగిలిన నెయ్యిని వేడి చేసి మిశ్రమంలో కలపాలి.
-
Step 11
దీనితో మధురాతి మధురమైన క్షీరాన్నం రెడీ. దీనిని వేడి వేడిగా స్టేట్లలో పెట్టి స్పూనులతో లేదా బెల్లం కోరును వినియోగించవచ్చు.
-
Step 12
క్షీరాన్నం తయారీలో పంచదార బదులుగా మెత్తని కలకండ సమానంగా కలిపి వుపయోగించవచ్చు.