- Step 1
ముందుగా పెసరపప్పును పొడిగా వున్న బాణాలిలో కొద్దిసేపు వేయించి పక్కన పెట్టుకోవాలి.
- Step 2
తరువాత బాణాలిలో కొంచెం నెయ్యి పోసి, కాగిన తరువాత జీడిపప్పు ముక్కలను, ఎండుద్రాక్ష పళ్ళను వేసి, వేయించి పక్కన పెట్టుకోవాలి.
- Step 3
తరువాత బియ్యంను శుభ్రంగా కడిగి, కుక్కర్ పాత్రలో వేసి, అందులో వేయించిన పెసరపప్పు, తొమ్మిది కప్పుల నీళ్ళు కలిపి పది నిమిషాలపాటు మెత్తగా ఉడికించాలి.
- Step 4
తరువాత స్టౌ మీద వెడల్పుగా వున్న బాణాలిని వుంచి, అందులో ఒక కప్పు నీళ్ళు పోసి మరిగించాలి.
- Step 5
అందులో బెల్లంకోరును వేసి బాగా కరిగేంత వరకు గరిటెతో కలియబెడుతూ వుండాలి.
- Step 6
బెల్లం బాగా కరిగిన తరువాత బాణాలిని స్టౌ మీద నుంచి కిందకు దించి, పాకాన్ని వడకట్టి, అందులోని మురికిని తొలగించాలి.
- Step 7
తరువాత బియ్యాన్ని శుభ్రంగా కడిగి, ఆందులో బెల్లం పాకాన్ని మళ్ళీ పోసి, లేతపాకం వచ్చేంత వరకు మరిగించాలి..
- Step 8
ఉంచుకున్న బియ్యం, పెసరపప్పుల మిశ్రమాన్ని వేసి, మీడియం సెగ మీద రెండు బాణాలిలో బెల్లం పాకం లేతపాకంగా మారిన వెంటనే అందులో ఉడికించి సిద్దంగా దించుకోవాలి.
- Step 9
రెండు నిమిషాలు గరిటెతో కలియబెడుతూ ఉడికించి, బాణాలిని స్టౌ మీద నుంచి కిందకు దించాలి. తరువాత ఇందులో నేతిలో వేయించి సిద్ధంగా వుంచుకున్న జీడిపప్పు ముక్కలు, ఎండుద్రాక్షలను, యాలకులనే ఎం చెసను నెయ్యిని వేసి బాగా కలియబారి దీనితో ఇంటిల్లిపాదినీ నోరూరించే ఛాందిని చక్కెరపొంగలి రెడీ.
- Step 10
చక్కెర పొంగలి తయారీకి బెల్లం కొరుకు బదులుగా పంచదారపొడిని కూడా వుపయోగించవచ్చు.