- Step 1
ముందుగా బియ్యంను శుభ్రంగా కడిగి, పది నిమిషాల పాటు నీటిలో నానబెట్టాలి.
- Step 2
తరువాత జీడిపప్పును చిన్న ముక్కలుగా చేసుకోవాలి.
- Step 3
తరువాత ఒక బాణాలిలో కొద్దిగా నెయ్యి పోసి అందులో జీడిపప్పు ముక్కలు, ఎండుద్రాక్షలను వేసి కొద్దిగా వేయించి, పక్కన పెట్టుకోవాలి.
- Step 4
తరువాత బరువుగల ఇత్తడి పాత్ర లేదా ప్రెషర్ పాన్లో కొబ్బరిపాలు పోసి స్టౌ మీద వుంచాలి.
- Step 5
పాలు మరగడం ప్రారంభించాక, నానబెట్టి సిద్ధంగా వుంచుకున్న బియ్యంను అందులో వేసి, మూత పెట్టి, సన్నని సెగలో బియ్యంను వేసి
తడిపోయేంతవరకు ఉడికించాలి. తరువాత బాణలిలో కొంచెం నెయ్యి పోసి, అందులో కొబ్బరితురుమును వేసి వేయించాలి
- Step 6
బియ్యం ఉడికిన తరువాత అందులో వేయించిన కొబ్బరి తురుమును, పంచదార పొడిని మూడు టేబుల్ స్పూనుల నెయ్యిని
వేసి బాగా కలియబెట్టాలి. తడి పూర్తిగా పోయేంతవరకు బియ్యంను, వేయించి, బాణలిని సా మీద నుంచి కిందకు దించుకోవాలి.
- Step 7
చివరిగా ఇందులో యాలకులపొడిని, నేతిలో వేయించి సిద్ధంగా వుంచుకున్న ఎండుద్రాక్ష, జీడిపప్పులను కలపాలి. దీనితో ఘుమఘుమలాడే కొబ్బరి తీపి పలావు రెడీ.