- Step 1
ముందుగా స్పౌ మీద ఒక పాత్రలో కొంచెం పాలను వెచ్చబెట్టి, తరువాత అందులో కుంకుమపువ్వును నానబెట్టాలి. తరువాత బాదంపప్పును వేడి నీటిలో వేసి పై పొట్టును తొలగించాలి. తరువాత బాదంపప్పు ముక్కలను, జీడిపప్పు ముక్కలలో కలిపి మెత్తటి ముద్దగా నూరుకోవాలి. తరువాత బాసుమతి బియ్యంను శుభ్రంగా కడిగి వడకట్టాలి.
- Step 2
ఒక బాణలిలో రెండు టేబుల్ స్పూనుల నెయ్యిని వేసి బియ్యం తడిపోయేంత వరకు వేయించాలి. తరువాత అనాసపళ్లు చెక్కు తీసి చిన్న ముక్కలుగా కోసి,ఒక పాత్రలో వేసుకోవాలి
- Step 3
అందులో కొద్దిగా నీళ్లు, కొద్దిగా పంచదారలను కలిపి, స్టౌ మీద సన్నని సెగలో మెత్తగా ఉడికించి దించుకోవాలి. టిన్నుల్లో లబ్యమయ్యే అనాస ముక్కల్ని వాడితే అందులోని జీరాను వడకట్టి, చిన్న చిన్న ముక్కలుగా చేయాలి.
- Step 4
జీరాలో కొద్దిగా పంచదారను వేసి మీద చిక్కగా తయారు చేసుకోవాలి. తరువాత బరువు గల పాత్ర లేదా ప్రెషర్ పాన్లో అయిదు కప్పుల నీళ్ళు పోసి, స్టౌ మీద ఉంచాలి.
- Step 5
నీళ్ళు మరిగాక అందులో వేయించి సిద్ధంగా వుంచుకున్న బియ్యంను వేసి పైన మూత పెట్టాలి. తడి పోయేంత వరకూ బియ్యంను ఉడికించి తరువాత అందులో పంచదార, జీరా, కొద్దిగా ఉప్పు, అనాసపండు ముక్కలు, వేసి బాగా కలియబెట్టాలి.
- Step 6
తరువాత ఇందులో నూరి సిద్ధంగా వుంచుకున్న బాదంపప్పు, జీడిపప్పుల ముద్దను వెచ్చని నీటిలో నానిన కుంకుమ పువ్వును, తాజా క్రీంను కలపాలి.
- Step 7
తరువాత ఇందులో మూడు స్పూనుల నెయ్యిని వేసి కలపాలి. తడి పూర్తిగా తొలగిపోయేంతవరకు మిశ్రమాన్ని స్టౌ మీద వుంచి, తరువాత బరువు గల పాత్ర లేదా ప్రెషర్ పాన్ ను స్టౌ మీద నుంచి కిందకు దించుకోవాలి.
- Step 8
తరువాత ఇందులో మూడు స్పూనుల నెయ్యిని వేసి కలపాలి.
- Step 9
తరువాత మిశ్రమం మీద యాలకుల పొడిని చల్లి, మిగిలిన నెయ్యిని కలపాలి. దీనితో అత్యంత మధురమైన పైనాపిల్ పలావ్ రెడీ.