- Step 1
ముందుగా మినప్పప్పును శుభ్రం చేసి రెండు గంటలపాటు నీళ్ళలో నానబెట్టాలి.
- Step 2
తరువాత అల్లంను చెక్కుతీసి శుభ్రం చేసుకోవాలి. కొత్తిమీరను సన్నగా తరగాలి.
- Step 3
తరువాత నానిన మినప్పప్పును శుభ్రంగా కడిగి, అందులో పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, వెల్లుల్లి రేకలు, అల్లం, ఇంగువ, తగినంత ఉప్పులను వేసి బరకగా రుచిగా పక్కన పెట్టుకోవాలి.
- Step 4
తరువాత బియ్యంను శుభ్రం చేసి నీళ్ళలో బాగా కడగాలి. తరువాత బియ్యం కొంచెం బిరుసుగా అన్నం వండుకోవాలి. తయారైన అన్నంను వెడల్పుగా పెద్ద పళ్ళెంలో పోసి, చల్లారనివ్వాలి.
- Step 5
గరిటెతో అన్నం మెతుకులు విడివిడిగా ఉండేలా చేసుకోవాలి. తరువాత ఒక బాణలిలో నూనె వేసి స్టౌ మీద వేడి చేయాలి.
- Step 6
అందులో అర టీ స్పూను ఆవాలు, ఒక టేబుల్ సూను మినపప్పులను వేసి పోపు పెట్టాలి.
- Step 7
తరువాత బరకగా నూరి సిద్దంగా ఉంచుకున్న మినపప్పు మిశ్రమాన్ని వేసి స్టౌను మీడియం సెగలో మండిస్తూ గరిటెతో కలియబెడుతూ పచ్చివాసన పోయేంతవరకు వేయించాలి. (మరీ ఎక్కువగా వేయించరాదు).
- Step 8
తరువాత పళ్లెంలో ఆరబెట్టిన అన్నంలో బాణలిలో వేయించి తయారు చేసుకున్న మిశ్రమాన్ని వేసి గరిటెతో బాగా కలియబెట్టాలి చివరిగా కరివేపాకును శుభ్రంగా కడిగి, కొంచెం నూనెలో వేయించి, పళ్ళెంలోని మిశ్రమంపై చల్లాలి.
- Step 9
దీనితో ఇంటిల్లిపాదినీ నోరూరించే మినపప్పు అన్నం రెడీ. దీనిని వేడి వేడిగా బంగాళాదుంపల కుర్మాతో తింటే చాలా బాగుంటుంది.