- Step 1
ముందుగా చింతపండును అయిదు లేక ఆరు కప్పుల నీళ్ళలో నానబెట్టి, రసమును ఒక పాత్రలో వడకట్టి, పక్కన పెట్టుకోవాలి తరువాత నువ్వులను తడిలేని కళాయిలో వేయించి పొడిగా దంచుకుని పక్కన పెట్టుకోవాలి.
- Step 2
ఆ తరువాత పదహారు ఎండు మిరపకాయల్ని, ఒకటిన్నర టీ స్పూనుల మినప్పప్పును, శెనగపప్పును, మిరియాలను, మెంతులను, ధనియాలను, కొంచెం నూనెలో వేయించి పొడిగా దంచుకోవాలి.
- Step 3
తరువాత ఉల్లిపాయను, కొత్తిమీరను సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. తరువాత బియ్యాన్ని శుభ్రంగా కడిగి కొంచెం బిరుసుగా అన్నంను వండాలి.
- Step 4
తరువాత ఈ ఆన్నంను వెడల్పుగా వున్న పళ్ళెంలో పోసి, మెతుకులు పొడిపొడి అయ్యే విధంగా ఆరబెట్టాలి.
- Step 5
తరువాత ఒక బాణలిలో రెండు టీ స్పూనుల నూనె వేసి ముందుగా ఇంగువను, తరువాత మిగిలిన పన్నెండు ఎండు మిరపకాయల్ని
వేసి వేయించాలి.
- Step 6
తర్వాత ఇందులో చింతపండు రసంనుపోయాలి తర్వాత ఇందులో పచ్చిమిరపకాయల్ని శుభ్రంగా కడిగి తుంచకుండా యధావిధిగా వేసి మిశ్రమం చిక్కని గుజ్జుగా తయారయ్యేంత వరకు స్టౌమీద ఉడికించాలి
- Step 7
తర్వాత నూనెను ఒక కళాయిలో పోసి, ఆవాలు, మిగిలిన రెండు టీ స్పూనుల మినపప్పును ముందుగా వేయించాలి తర్వాత అందులో సాంబారు ఉల్లిపాయల్ని వేసి ఎర్రగా వేయించాలి.
- Step 8
తర్వాత పళ్లెంలో ఆరబెట్టిన అన్నంలో నువ్వుల పొడిని, చింతపండు గుజ్జును, ఎండుమిరపకాయల్ని, మినపప్పు, శనగపప్పు, మిరియాలు, మెంతులు, ధనియాలతో తయారుచేసి సిద్ధంగా ఉంచుకున్న పొడిని, వేయించిన వేరుశనగపప్పును, వేయించిన ఆవాలు, మినపప్పు, సాంబార్ ఉల్లిపాయల మిశ్రమాన్ని కలపాలి
- Step 9
చివరగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని, కొత్తిమీరను మిశ్రమంగా చల్లాలి. చివరగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని, కొత్తిమీరను మిశ్రమంగా చల్లాలి.దీనితో మధురమైన ప్రీతి పులిహోర రెడీ.