- Step 1
ముందుగా దానిమ్మ పళ్ళ తొక్కను తొలగించి, గింజలు తీయాలి.
- Step 2
తరువాత ఈ గింజలను మిక్సీలో వేసి జ్యూస్ తయారు చేయాలి. తరువాత ఈ జ్యూస్ ను వడగట్టి గింజల్ని తొలగించాలి.
- Step 3
తరువాత పచ్చిమిరప కాయల్ని సన్నగా తరగాలి ఎండుమిరపకాయల్ని ముక్కలుగా చేయాలి.
- Step 4
తరువాత బియ్యంను శుభ్రంగా కడిగి, కొంచెం బిరుసుగా అన్నం వండాలి తరువా ఈ అన్నంను వెడల్పుగా వున్న పళ్ళెంలో పాడిపాడిగా సర్ది చల్లారబెట్టాలి.
- Step 5
తరువా బాణాలిలో నూనె పోసి స్టౌ మీద వేడి చేయాలి. ఇందులో ముందుగా ఆవాలు, మినప శెనగపప్పులను వేసి పోపు పెట్టాలి.
- Step 6
తరువాత శుభ్రంగా కడిగిన కరివేపాకు, ఎండుమిరపకాయ ముక్కలు వేయించాలి.
- Step 7
తర్వాత బాణిలో వేయించిన మిశ్రమాన్ని పళ్లెంలో ఆరబెట్టిన అన్నంలో కలపాలి.
- Step 8
తరువాత దానిమ్మ రసంను పోసి, కొంచెం సేపు స్టౌ మీద ఉంచాలి.తర్వాత అందులో పళ్లెంలోని అన్నం మిశ్రమాన్ని తగినంత ఉప్పు వేసి స్టౌను సన్నని సెగమీద మండించాలి.
- Step 9
రసం ఇరిగిపోయి అన్నం పొడిగా అయ్యేంత వరకు గరిటెతో కలియబెడుతూ వుండాలి. తరువాత కళాయిని స్టౌ మీద నుండి దించుకోవాలి.
- Step 10
తరువాత దీని మీద సన్నగా తరిగిన కొత్తిమీరను చల్లుకోవాలి. దానిమ్మ గింజల అన్నం రెడీ.