- Step 1
ముందుగా పచ్చిబఠానీలను వేడినీటిలో మెత్తగా ఉడికించి, నీళ్ళను వార్చి, పక్కన పెట్టుకోవాలి. తరువాత పచ్చిమిరపకాయల్ని శుభ్రంగా కడిగి నిలువుగా ముక్కలుగా తరగాలి.
- Step 2
సాంబారు ఉల్లిపాయల పొట్టు తొలగించి పక్కన పెట్టుకోవాలి. టమోటాలను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా తరగాలి. బచ్చలికూరను శుభ్రంగా కడిగి, సన్నగా తరిగి పెట్టుకోవాలి. జీడిపప్పును నేతిలో వేయించి పక్కన వుంచుకోవాలి.
- Step 3
తరువాత బియ్యంను శుభ్రంగా కడిగి, అన్నం వండాలి. తరువాత ఈ అన్నంను ఒక వెడల్పుగా వున్న పళ్లెంలో వేసి మెతుకులు పొడిపొడిగా వుండేలా ఆరబెట్టాలి.
- Step 4
తరువాత ఒక బాణలిలో కొంచెం నూనె పోసి స్టౌ మీద వేడి చేయాలి తరువాత ఇందులో సన్నగా తరిగిన బచ్చలి కూరను వేసి, నీళ్ళు చల్లి, ఆకులో తడిపోయేంతవరకు సన్నని సెగమీద వేయించాలి.
- Step 5
తరువాత బాణాలిని కిందకు దించుకోవాలి. తరువాత ఒక కళాయిలో కొద్దిగా నూనె పోసి ధనియాలు, ఎండు మిరపకాయలను వేసి వేయించాలి. తరవాత కళాయిని కిందికి దించుకోవాలి.
- Step 6
తర్వాత వేయించిన ధనియాలు, కొబ్బరితురుమును కొంచెం నీళ్లు కలిపి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఓ బాణలిలో తగినంత నూనె పోసి, ముందుగా పచ్చిమిరపకాయ ముక్కలు, పొట్టు తీసిన సాంబారు ఉల్లిపాయల్ని వేయించాలి.
- Step 7
తర్వాత ఇందులో టమాట ముక్కల్ని, గ్రైండ్ చేసి సిద్ధంగా ఉంచుకున్న ధనియాలు, ఎండుమిర్చి, బచ్చలికూర, జీడిపప్పు ముక్కలు, కొబ్బరి తురుముల మిశ్రమాన్ని కలపాలి.
- Step 8
తర్వాత ఒక కళాయిలో కొద్దిగా నూనెపోసి దాల్చిన చెక్క, లవంగాలు కలపాలి తర్వాత ఈ మిశ్రమాన్ని బాణాలిలో వేగుతున్న టమాట మిశ్రమంలో కలపాలి. ఈ మిశ్రమానికి తడి ఆరిపోయి, కమ్మటి వాసన వచ్చే వరకు వేయించాలి.
- Step 9
తర్వాత బాణిలిలో ఆరబెట్టిన అన్నం, తగినంత ఉప్పులను వేసి బాగా కలియబెట్టి సన్నని సెగమీద అన్నం వేడెక్కెంత వరకు ఉంచి బాణాలిని కిందకు దించుకోవాలి. దీంతో ఘుమఘుమలాడే భవ్య బచ్చలి కూర అన్నం రెడీ.