- Step 1
ముందుగా చింతపండులో నాలుగు కప్పుల నీళ్ళు పోసి నానబెట్టాలి.
- Step 2
తరువాత మిరియాలను బరకగా దంచి పొడి చేసుకోవాలి. తరువాత బాణలిలో కొద్దిగా నూనె పోసి మెంతులు, ధనియాలను మిరియాలను వేసి వేయించాలి.
- Step 3
తరువాత బియ్యంను శుభ్రంగా కడిగి, కొంచెం బిరుసుగా అన్నంను పండుకోవాలి.
- Step 4
తరువాత దీనిని వెడల్పుగా వున్న పళ్ళెంలో వేసి మెతుకులు పొడిపొడిగా వుండేలా సర్ది చల్లారబెట్టాలి.
- Step 5
తరువాత ఒక బాణలిలో కొంచెం నూనె పోసి ఎండుమిరపకాయ ముక్కల్ని, ఇంగువ పొడిని వేసి వేయించాలి.
- Step 6
తరువాత ఇందులో చింతపండు గుజ్జు, పసుపులను వేసి, చిక్కబడేంతవరకు గరిటెతో కలుపుతూ ఉడికించాలి.
- Step 7
తరువాత ఇందులో తయారు చేసి సిద్ధంగా వుంచుకున్న బరకగా మిరియాలపొడి, ఉప్పులను కలిపి, బాణాలిని మీద నుంచి కిందకు దించుకోవాలి..
- Step 8
తరువాత పళ్ళెంలోని అన్నంలో బాణాలిలోని చింతపండు గుజ్జు మిశ్రమాన్ని మెంతులు, ధనియాలు, మిరియాలపొడిని వేసి బాగా కలియబెట్టాలి.
- Step 9
తరువాత ఒక కళాయిలో కొంచెం నువ్వుల నూనె పోసి, కరివేపాకు, జీడిపప్పు ముక్కలను వేయించి, పళ్ళెంలోని అన్నం మిశ్రమంపై చల్లుకోవాలి దీనితో ఇంటిల్లిపాదినీ నోరూరించే పులిహోర రెడీ. దీనిని చల్లబడిన తరువాత భుజిస్తే చాలా బాగుంటుంది.