- Step 1
ముందుగా చింతపండులో కొంచెం నీళ్ళు పోసి నానబెట్టాలి. తరువాత ఒక బాణలిలో నెయ్యిని పోసి జీడిపప్పు ముక్కలు, వేరుశనగ పప్పులను వేయించి, తీసి పక్కన పెట్టుకోవాలి.
- Step 2
తరువాత తరువాత బియ్యంను శుభ్రంగా కడిగి అన్నం వండాలి. ఈ అన్నంను వెడల్పుగా వున్న పళ్ళెంలో వేసి మెతుకులను పొడిగా సర్ది చల్లారబెట్టాలి.
- Step 3
తరువాత ఇందులో పన్నెండు ఎండు మిరపకాయలు, ఒక టీ స్పూను ఆవాలు, ఇంగువలను కొంచెం నూనెలో వేయించి తీసుకోవాలి.
- Step 4
ఇందులో చింతపండు గుజ్జు, చట్నీ శెనగపప్పు, బెల్లంలను కలిపి మెత్తగా నూరుకోవాలి.
- Step 5
తరువాత ఇందులో నూరి సిద్ధంగా వుంచుకున్న ఎండుమిరపకాయలు, తరువాత ఒక పెద్ద కళాయిలో నూనె పోసి అందులో మిగిలిన రెండు టీ స్పూనుల ఆవాలు, నాలుగు మిరపకాయల ముక్కలు, మినప్పప్పు, శెనగపప్పు, కరివేపాకులను ఆవాలు, ఇంగువ, చింతపండు గుజ్జు చట్నీ శనగపప్పు, బెల్లంల మిశ్రమాన్ని కలిపి, పచ్చివాసన పోయేంతవరకు.
- Step 6
తరువాత ఇందులో పళ్ళెంలో ఆరబెట్టిన అన్నం, తగినంత ఉప్పులను వేసి బాగా కలియబెట్టాలి. , కళాయిని స్టౌ మీద నుంచి దించుకోవాలి.
- Step 7
తరువాత కళాయిలోని అన్నం మిశ్రమం మీద నెయ్యిలో వేయించి సిద్దంగా వుంచుకున్న జీడిపప్పు ముక్కలు, వేరుశెనగ ముక్కలను చల్లి అలంకరించాలి. దీనితో మధురాతిమధురమైన ఆవాలపొడి అన్నం రెడి.