- Step 1
ముందుగా బియ్యంను శుభ్రంగా కడిగి పావుగంట పాటు నీళ్ళలో నానబెట్టాలి. ఉల్లిపాయల్ని సన్నగా తరగాలి.
- Step 2
తరువాత బంగాళాదుంపల్ని కూడా తరిగి వాటిని నూనెలో వేయించాలి.
- Step 3
తర్వాత బాణిలిలో తగినంత నూనె పోసి వేడిచేయాలి
- Step 4
ఇందులో ముందుగా వేరుశెనగ గుళ్ళను, తరువాత ఉల్లిపాయ ముక్కల్ని వేసి వేయించాలి.
- Step 5
తరువాత ఇందులో వేయించి సిద్దంగా వుంచుకున్న బంగాళా దుంపల్ని, నానబెట్టిన బియ్యంను, తగినంత ఉప్పులను వేయాలి.
- Step 6
తరువాత గరం మసాలా, బెల్లంకోరు, కిస్మిస్ లను, నాలుగు కప్పుల నీళ్ళు పోసి పది నిమిషాలపాటు సన్నని మంట మీద ఉడికించాలి
- Step 7
నీరు ఇగిరిపోయిన తరువాత బాణాలిని స్టౌ మీద నుంచి కిందకు దించుకోవాలి. దీనితో మధురమైన ఘుమఘుమలాడే ట్వింకిల్ టర్కిష్ రైస్ రెడీ