- Step 1
ముందుగా బియ్యంను శుభ్రంగా కడిగి కొద్దిసేపు నీళ్ళలో నానబెట్టాలి.
- Step 2
తరువాత పాత్రలో వేసి కొలవాలి. ఇందులో సగం రవ్వను తీసుకుని ఒక మందపాటి పాత్రలో వేసుకోవాలి.
- Step 3
తరువాత ఇందులో రెండున్నర రెట్ల నీళ్ళు పోసుకోవాలి తరువాత ఇందులో కొంచెం ఉప్పు, రెండు టేబుల్ స్పూనుల నూనె వేసి, స్టౌ మీద పెట్టి ఉడికించాలి.
- Step 4
రవ్వ ఉప్మా మాదిరిగా తయారైన తరువాత పాత్రను స్టౌ మీద నుంచి దించి పక్కన పుంచుకోవాలి
- Step 5
తరువాత లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్కలను దంచి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక వెడల్పుగా వున్న బాణాలిలో ముందుగా కొంచెం నెయ్యి లేదా డాల్డాను వేసి స్టౌ మీద వేడి చేయాలి.
- Step 6
ఇందులో జీడిపప్పు ముక్కల్ని వేసి దోరగా వేయించాలి. తరువాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి.
- Step 7
తరువాత బాణలిలో మిగిలిన నెయ్యి లేదా డాల్డాను పోసి, కాగిన తరువాత ముందుగా పుదీనాను, పచ్చిమిరపకాయ ముక్కల్ని, ఆతరువాత అల్లం-వెల్లుల్లి ముద్దను వేసి వేయించాలి.
- Step 8
తరువాత దంచి సిద్ధంగా వుంచుకున్న లవంగాలు, యాలకులు, రాసినచెక్కలతో కూడిన పొడిని కలపాలి. తరువాత ఈ మిశ్రమంలో కాలిఫ్లవర్ ముక్కల్ని వేసి వేయించాలి
- Step 9
తరువాత పసుపు, తగినంత ఉప్పు, కారంలను కలిపి సన్నని మంట మీద మెత్తగా అయ్యేంతవరకు ఉడికించాలి
- Step 10
తరువాత బాణాలిలోని ఉడుకుతున్న మిశ్రమంలో సన్నగా తరిగి సిద్ధంగా వుంచుకున్న కొత్తిమీర, గరంమసాలాపొడులను కలపాలి.
- Step 11
తరువాత ఉడికించి సిద్దంగా వుంచుకున్న రవ్వను కలపాలి. మిశ్రమాన్ని బాగా కలిపి, తరువాత ముందుగా నెయ్యి లేదా డాల్డాలో వేయించి సిద్ధంగా వుంచుకున్న జీడిపప్పు ముక్కల్ని కలపాలి.
- Step 12
తరువాత బాణాలిని స్టౌ మీద నుంచి కిందకు దించుకోవాలి.