- Step 1
ముందుగా ఆవాలను దంచి పిండిగా చేసుకోవాలి. పచ్చిమిరపకాయల్ని నిలువుగా కోసుకుని పక్కన పెట్టుకోవాలి.
- Step 2
తరువాత బియ్యంను శుభ్రంగా కడిగి ఎసరు పోసి స్టౌ మీద ఉడికించాలి.
- Step 3
అన్నం ఉడికిన తరువాత గంజిని వార్చి, అన్నంను ఒక పళ్ళెంలో ఆరబెట్టాలి.
- Step 4
తరువాత చింతపండును తగినంత నీరు పోసి ఒక పాత్రలో ఉడికించాలి.
- Step 5
తరువాత చింతపండు గుజ్జులో పచ్చిమిరపకాయ ముక్కలు, పసుపు, తగినంత ఉప్పులను కలపాలి.
- Step 6
వీటిని కొద్దిసేపు ఉడికించి, తరువాత పాత్రను స్టౌ మీద నుంచి కిందకు దించుకోవాలి.
- Step 7
తరువాత ఒక బాణలిలో నూనె వేసి స్టౌ మీద వేడి చేయాలి. ఇందులో ముందుగా ఎండుమిరపకాయ ముక్కలు, ఆవాలు, ఇంగువ, శెనగపప్పు, మినప్పప్పులను కలిసి తాలింపు పెట్టాలి.
- Step 8
తరువాత నువ్వు పిండి, మెంతిపొడి, ఆవపిండిలను కలపాలి. తరువాత ఈ మిశ్రమంలో ఉడికించి సిద్దంగా వుంచుకున్న చింతపండు గుజ్జు
మిశ్రమాన్ని వేసి బాగా కలియబెట్టాలి.
- Step 9
కొద్దిసేపు ఉడికిన తరువాత ఈ మిశ్రమాన్ని పళ్ళెంలో ఆరబెట్టిన అన్నంలో వేసి బాగా కలియబెట్టాలి.
- Step 10
దీనితో మధురాతి మధురమైన తెలుగు వారికి ప్రీతిపాత్రమైన ఆంధ్రా పులిహోర రెడీ. దీనిని వేడి మీద వడ్డించకూడదు.
మూడు, నాలుగు గంటలు గడిచాక వడ్డిస్తే అత్యంత రుచికరంగా వుంటుంది.