- Step 1
ముందుగా మటన్’ను మంచినీటితో శుభ్రం చేసుకుని.. ఆ మాంసపు ముక్కలకు పెరుగు, కారం, జీలకర్ర పొడి, మిరియాల పొడి మిక్స్ చేసి.. రెండుగంటలపాటు నానబెట్టుకోవాలి.
- Step 2
తర్వాత ఒక పాన్ తీసుకుని అందులో కొద్దిగా నూనె పోసి వేడి చేసుకోవాలి. వేడయ్యాక అందులో పలావ్ ఆకు, జీలకర్ర, పెప్పర్ కార్న్, లవంగాలు, ఏలకలు తదితర పదార్థాలు వేసి.. మూడునిముషాలపాటు ఉడికించుకోవాలి.
- Step 3
ఆ మిశ్రమాన్ని వేడిచేసిన అనంతరం అందులోనే ఉల్లి తరుగు వేసి దోరగా వేపాలి. అనంతరం వెల్లుల్లి, అల్లం పేస్ట్ కూడా వేసి.. మరో రెండు నిముషాలపాటు వేడి చేయాలి.
- Step 4
ఈ మిశ్రమాన్ని ఇదివరకు నానబెట్టుకున్న మటన్ ముక్కలకు కలిపి మ్యారినేట్ చేయాలి. ఇలా మ్యారినేట్ చేసిన ముక్కలకు కుక్కర్’లో రెండు కప్పుల నీటితో జోడించి... ఐదారు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించాలి.
- Step 5
ఎంత ఎక్కువ వేడి చేస్తే.. మటన్ ముక్కలు అంతే ఎక్కువగా మెత్తబడతాయి. బాగా ఉడికించిన అనంతరం కుక్కర్’ను స్టౌమ్ మీద నుంచి దించేయాలి. అంతే! హైదరాబాద్ మటన్ మసాలా రెడీ!