- Step 1
ముందుగా బియ్యం, పెసరపప్పులను శుభ్రంగా కడిగి నీటిలో అరగంటపాటు నానబెట్టాలి.
- Step 2
తరువాత పచ్చిబఠానీలను కూడా మరొక గిన్నెలో నానబెట్టుకోవాలి. తరువాత ఉల్లిపాయల్ని సన్నగా తరగాలి. టమోటాలను ముక్కలుగా కోసుకోవాలి. పచ్చిమిరపకాయల్ని కూడా సన్నగా తరగాలి.
- Step 3
తరువాత ఒక బాణలిలో నెయ్యిని పోసి స్టౌ మీద వేడి చేయాలి. ఇందులో ముందుగా ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఎర్రగా వేయించాలి.
- Step 4
తరువాత అల్లం-వెల్లుల్లి ముద్ద, గరంమసాలా, మరాఠీ మొగ్గలు వేసి వేయించాలి.
- Step 5
తరువాత ఇందులో నానబెట్టిన పచ్చిబఠానీలు, మీల్ మేకర్, పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసి బాగా కలియబెట్టాలి.
- Step 6
రెండు నిమిషాలు గడిచాక తగినంత నీరు పోసి ఎసరు పెట్టాలి. బాణలిలోని ఎసరు మరుగుతుండగా అందులో నానబెట్టిన బియ్యం, పెసరపప్పుల మిశ్రమాన్ని, తగినంత ఉప్పును, టమోటా ముక్కలను వేసి మంట తగ్గించి నీరంతా ఇగిరిపోయేంత వరకు ఉడికించాలి.
- Step 7
తరువాత బాణాలిని మీద నుంచి కిందకు దించుకోవాలి. దీనితో ఘుమఘుమలాడే కిచిడి పలావు రెడి. దీనిని వేడివేడిగా వడ్డించాలి.