- Step 1
ముందుగా బియ్యంను శుభ్రంగా కడిగి అరగంట పాటు నీళ్ళలో నానబెట్టాలి. ఈలోపుగా ఉల్లిపాయల్ని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.
- Step 2
అరగంట దాటిన తరువాత ముందుగా ఒక బాణలిలో నెయ్యి లేదా నూనెను పోసి స్టౌ మీద వేడి చేయాలి.
- Step 3
ఇందులో ముందుగా జీలకర్ర, ఎసాపాటిడాను వేసి అవి చిటపటలాడడం ప్రారంభించాక ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఎర్రగా వేయించాలి.
- Step 4
తరువాత ఇందులో నానబెట్టిన బియ్యంను నీళ్ళు వార్చి కలపాలి. ఈ మిశ్రమంను కొద్దిసేపు వేయించి, తరువాత ఇందులో గరంమసాలా
తగినంత ఉప్పులను కలిపి, కొంచెం నీళ్ళు పోసి బియ్యంను ఉడికించాలి.
- Step 5
ఎసరు బాగా ఇగిరిపోయిన తరువాత అందులో నిమ్మకాయ రసంను కలపాలి.
- Step 6
తరువాత పైన ముందుగా వేయించి సిద్ధంగా వుంచుకున్న జీడిపప్పు ముక్కల్ని వేసి అలంకరించి, బాణాలిని స్టే మీద నుంచి కిందకు దించుకోవాలి. దీనితో ఘుమఘుమలాడే మసాలా రైస్ రెడీ.