- Step 1
ముందుగా ఉల్లిపాయల్ని, పచ్చిమిరపకాయల్ని, పుదీనాను విడివిడిగా సన్నగా తరిగి వుంచుకోవాలి.
- Step 2
తరువాత బియ్యంను శుభ్రంగా కడిగి అన్నం పండుకోవాలి. తరువాత ఈ అన్నంను వెడల్పుగా వున్న పళ్ళెంలో వేసి పొడిగా సర్ది చల్లబరచాలి.
- Step 3
తరువాత ఒక కళాయిలో నూనె పోసి స్థా మీద వేడి చేయాలి. ఇందులో పచ్చిమిరపకాయ ముక్కలు, పుదీనా వేసి తడి ఆరిపోయేంతవరకు వేయించాలి
-
Step 4
-
తరువాత కళాయిని స్టౌ మీద నుంచి కిందకు దించుకోవాలి.
- Step 5
ఈ మిశ్రమంలో ఎండుకొబ్బరికోరు, తగినంత ఉప్పు, చింతపండులను కలిపి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేయాలి.
- Step 6
తరువాత వెడల్పుగా వున్న బాణలిలో నూనెను పోసి వేడి చేయాలి. తరువాత ఇందులో ఆవాలు, మినప్పప్పు, శెనగపప్పు, కరివేపాకు, జీడిపప్పు ముక్కలను, ఉల్లిపాయముక్కల్ని వేసి వేయించాలి.
- Step 7
తరువాత ఇందులో గ్రైండ్ చేసి సిద్ధంగా పుంచుకున్న ఎండుకొబ్బరి, ఉప్పు, చింతపండు, పచ్చిమిరపకాయ ముక్కలు, పుదీనా
ఆకుల మిశ్రమాన్ని కలిపి పచ్చి వాసన పోయేంతవరకు వేయించాలి.
- Step 8
మిశ్రమం కమ్మని వాసన వస్తుండగా అందులో పళ్ళెంలో ఆరబెట్టిన అన్నంను వేసి బాగా కలియబెట్టాలి.
- Step 9
అన్నం మిశ్రమం వేడిక్కిన తరువాత బాణాలిని స్టౌ మీద నుంచి కిందకు దించుకుంటే.. ఇంటిల్లిపాదినీ నోరూరించే పుదీనా రైస్ రెడీ.