- Step 1
పెరుగు కమ్మగా ఉండాలి. పెరుగును కవ్వంతో చిలికి, దానిలో ఉప్పు, అల్లం, పచ్చి మిర్చి, కొబ్బరి రుబ్బి కలిపి, రెండు స్పూన్లు నూనె
వేడి చేసి దానిలో రెండు ఎండు మిర్చి ముక్కలు, ఆవాలు, జీరా, మినపప కరివేపాకు వేసి తాలింపు చేసి పెరుగులో కలపాలి.
- Step 2
తరువాత కొత్తిమీర తరుగు కలపాలి. మినపప్పు కడిగి నాలుగు గంటలు నాన పెట్టాలి.
- Step 3
తరువాత కొంచెం నీరు వేసి గట్టిగా మెత్తగా రుబ్బాలి.
- Step 4
నూనె వేడి చేసి వడలుగా చేసి నూనెలో వేసి వాటిని పెరుగులో కలపాలి. అప్పుడు వెంటనే మెత్త బడతాయి.
- Step 5
పెరుగులో వడ బాగా మునిగేట్టుగా ఉండాలి.
- Step 6
ఇష్టం ఉన్నవారు, ఉల్లి, కారెట్ తురుమును కూడా ఈ పెరుగులో కలుపుకోవచ్చును.