- Step 1
సేమ్యా కడిగి, నీళ్ళు వేసి ఉడికించి జల్లెడలో వార్చాలి. నీరు బాగా పోయిన తరువాత, డిష్ లో తీసి, పచ్చికొబ్బరి తురుము, ఉల్లి
కలపాలి.
- Step 2
బాండీలో నెయ్యి వేడిచేసి, ఆవాలు, జీరా, మినప్పప్పు, తాలింపు వేసి, కరివేపాకు, జీడిపప్పు ఎండుమిర్చి, పచ్చిమిర్చి ముక్కలు,
క్యారెట్ చిన్న ముక్కలు, పచ్చిబఠానీ వేసి దోరగా వేయించాలి.
- Step 3
సేమ్యాలో కలిపి మూత పెట్టి అరగంట తరువాత రుచి చూస్తే చాలా రుచిగా ఉంటుంది.
- Step 4
కొత్తిమీర కడిగి కట్ చేసి కలపాలి. ఈ (ఇడియాప్పం) బియ్యపుపిండి సేమ్యాతో పులుసు పులిహోర మాదిరిగా కూడ చేస్తే చాలా బాగుంటుంది.