- Step 1
మైదాపిండిని, బేకింగ్ పౌడర్ రెండింటిని ముందుగా జల్లెడలో జల్లించి... అందులోనుంచి వచ్చే మలినాలను పడేసి, స్వచ్ఛమైన దానిని పక్కన పెట్టుకోవాలి.
- Step 2
అలాగే ఎండు ద్రాక్షలను కూడా ముందుగా శుభ్రం చేసుకుని.. వాటిపై గల తొడిమలను పూర్తిగా తీసేసుకోవాలి.
- Step 3
తర్వాత ఇదివరకు జల్లించిన మైదాపిండి, బేకింగ్ పౌడర్’లతోబాటు వెన్నను, పంచదార పొడిని ఒక పాత్రలో వేసి కలుపుకోవాలి. మొత్తం మిశ్రమాన్ని ఒక క్రీమ్’లాగా చేసుకోవాలి.
- Step 4
ఇలా క్రీంగా చేసుకున్న అనంతరం వెనిల్లా ఎస్సెన్స్’తోబాటు గిలక్కొట్టుకున్న గుడ్డును సొనను ఆ క్రీంకు బాగా కలుపుకోవాలి.
- Step 5
ఇలా కలుపుకున్న ఈ మిశ్రమానికి ఇదివరకు శుభ్రం చేసుకున్న ఎండుద్రాక్షను చేర్చాలి. అలాగే మైదాతోబాటు అరకప్పు పాలను కూడా కలుపుకోవాలి. (ఇలా కలిపినప్పుడు పిండి జారుగా తయారవుతుంది).
- Step 6
ఈ విధంగా క్రీమింగ్ చేసుకున్న పిండిని పేపర్ కప్స్’లో పోసి 500 డిగ్రీల ఫారెన్’హీట్’లో 30 నిముషాలపాటు ఉడికించాలి.
- Step 7
బాగా ఉడికించిన అనంతరం దానికి క్రిందకు దించేయాలి. చివరగా కేక్’పై చెర్రీ పండ్లతోగానీ, ఇతర డ్రైఫ్రూట్స్’తోగానీ గార్నిష్ చేసుకోవాలి. అంతే! డ్రైఫ్రూట్ బటర్ కేక్ రెడీ!