ప్రతిఒక్కరికి అప్పుడప్పుడు చిరుజబ్బులు రావడం సహజం. అయితే ఆ జబ్బుల్లో జలుబు మాత్రం అంత సామాన్యంగా వీడదు. కనీసం ఓ వారం రోజుల వరకు పట్టిపీడుస్తూనే వుంటుంది. ఎన్ని మందులు వాడినా.. ఎన్ని ప్రయోగాలు చేసినా.. జలుబు మాత్రం పోదు. అయితే దాని సమస్య నుంచి బయటపడాలంటే శొంఠి కాఫీ చాలా బెస్ట్!
ముందుగా శొంఠి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.. ఇది జీర్ణశక్తికి బాగా పని చేస్తుంది. అలాగే కడుపులో నులిపురుగుల నివారణకు ఇది ఉపకరిస్తుంది. తలనొప్పి వస్తే.. శొంఠి నీటిలో అరగదీసి కణతలకు, నుదురుకు పట్టిస్తే... వెంటనే ఉపశమనం కలుగుతుంది. అటువంటి శొంఠితో కాఫీ చేసుకుని తాగితే.. జలుబు నుంచి కూడా త్వరగా ఉపశమనం లభిస్తుంది. మరి దీన్నేలా చేస్తారో తెలుసుకుందామా...