- Step 1
బాండీలో కొంచెం నెయ్యి వేసి వేడి చేసి, ఎండుమిర్చి, మెంతులు, జీరా, మిరియాలు, ధనియాలు, వేపించి కొబ్బరి తురుము కూడ వేసి
వేపించాలి.
- Step 2
ఎర్రగా వేగిన మసాలను ముద్దగా కొంచెం నీరు వేసి రుబ్బి ఉంచాలి. చికెన్ ను క్లీన్ చేసి కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి బేసిన్ లో పెట్టి, రుబ్బిన మసాల, ఉప్పు బాగా పట్టించి అరగంట నాన పెట్టాలి
- Step 3
బాండీలో నెయ్యి వేడిచేసి ఉల్లి ముక్కలను ఎర్రగా వేపించి గరమ్ మసాల పొడి కలిపి నాన పెట్టిన చికెన్ ముక్కలను వేసి బాగా కలిపి, 2 కప్పుల కొబ్బరిపాలు పోసి ఉడికించాలి (కొబ్బరి తురుము కొంచెం నీరు వేసి రుబ్బి పాలు తీయాలి.)
- Step 4
సర్వ్ చేసే ముందు నిమ్మరసం కలిపి ఇస్తే చాలా రుచిగా ఉంటుంది.